జగపతి బాబు ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ మూవీస్‌కి కెరాఫ్ గా నిలిచాడు.కాని ఇప్పుడు విలన్ పాత్రలను కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నాడు జగపతిబాబు.ఈ సీనియర్ హీరో కథానాయకుడిగా ‘పటేల్’ అనే సినిమాలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. వారాహి బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మాణంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా ద్వారా వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ లోని వారాహి ఆఫీసులో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్ కి కీరవాణి క్లాప్ కొట్టగా .. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కుతుందనీ, జగపతిబాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు చెప్పారు.
మరి ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే, ముందుగా రూపొందించిన టీజర్ ను వదిలారు. ఈ టీజర్ కు ఇంతవరకూ 1.54 మిలియన్ వ్యూస్ దక్కడం విశేషం.ఇంత త్వరగా ఈ సినిమా టీజర్ కి ఈ స్థాయి వ్యూస్ లభించడం చెప్పుకోదగిన విషయమేనని అంటున్నారు. జగపతిబాబుకి ఇటీవల పెరిగిపోయిన క్రేజే ఇందుకు కారణమని చెబుతున్నారు. వెరైటీ హైయిర్ స్టైల్ .. గెడ్డం మీసాలతో జగపతిబాబు ఈ టీజర్లో కొత్తగా కనిపిస్తున్నాడు. వారాహి చలచిత్ర బ్యానర్ పై వాసు పరిమి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.