జేడీయూని చీల్చిన బీజేపీ..

137
nithish
- Advertisement -

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్న బీజేపీ తాజాగా మణిపూర్‌లో బీజేపీని చీల్చింది. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. 38 ఎమ్మెల్యే సీట్లున్న మణిపూర్‌లో జేడీయూ నుంచి ఆరుగురు విజయం సాధించారు. వారిలో ఐదుగురు పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి… బీజేపీలో చేరారు. తమ పార్టీని బీజేపీలో కలిపేస్తున్నామని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. దానిని స్పీకర్ ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి మేఘజిత్‌ సింగ్‌ ప్రకటించారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేనను చీల్చి మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చిన విషయం తెలిసిందే. ఏకంగా ఉద్ధవ్‌ థాక్రేను పార్టీ నుంచి దూరం చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక బిహార్‌లో బీజేపీకి రాంరాం చెబుతూ సీఎం నితీశ్‌ కుమార్‌.. ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో జేడీయూని మణిపూర్‌లో చీల్చింది బిహార్.

- Advertisement -