- Advertisement -
దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్కత్తా నగరాల్లో 5జీ సేవలను దీపావళికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి నెల ఈ సేవలను విస్తరించుకుంటూ వెళతామని చెప్పారు. 2023డిసెంబర్ కల్లా అంటే రాబోయే 18నెలల్లో దేశంలోని ప్రతి పట్టణం ప్రతి మండలంలో ఈసేవలు అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం రూ.2లక్షల కోట్లు వెచ్చించనునన్నామని ముకేశ్ తెలిపారు. జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతోందని, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియో దూసుకువెళ్తోందని, 5జీతో సుమారు వంద మిలియన్ల ఇండ్లను కనెక్ట్ అవుతామని ముకేశ్ తెలిపారు.
- Advertisement -