మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫ్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి చిత్రాలు వీరిద్ధరి కాంబినేషన్‌లో రాగా…. తాజాగా మరో సినిమా కూడా వీరిద్ధరి కాంబినేషన్‌లో తెరకెక్కనుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకోన్నాయి. ప్రముఖ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కథాపరంగా ఎంత నికచ్ఛిగా ఉంటారో త్రివిక్రమ్.. అందులో నటుల పరంగా అలాగే ఉంటారని టాలీవుడ్ టాక్.
SSMB28లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల వెల్లడించాయి. SSMB28లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం లవర్ బాయ్ తరుణ్‌ని తీసుకోనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వరుస పరాజయాలతో కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తరుణ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నువ్వే నువ్వే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న త్రివిక్రమ్, తరుణ్ తొలిసారి టాలీవుడ్‌కు ఒక కొత్త ప్రేమ సినిమాను చూపించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లవర్‌బాయ్‌ను ఏవిధమైన రోల్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారో ప్రస్తుతం టాలీవుడ్ గుసగుసలాడుతోంది. ఇంకా దీనిపై త్రివిక్రమ్ అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

