మహేష్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, భరత్(‘ప్రేమిస్తే’ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనున్నారు.
యనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ కూడా పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనుందట.
మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీతం: జిబ్రాన్.

