ప్రభాస్ – మారుతి మూవీ అప్‌డేట్!

42
maruthi
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించనున్నారు హీరో ప్రభాస్‌. ఇందులో ఒకటి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాగా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆల్‌రెడీ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో థియేటర్‌ సెట్‌ను రెడీ చేస్తున్నారట.

ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ త్వరలోనే జాయిన్‌ కానున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సందీప్​ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’​ చిత్రం కన్నా ముందే ఈ మూవీని సెట్స్​పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’​, ‘సలార్’, ‘ప్రాజెక్ట్​ కె’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

- Advertisement -