ఆర్జేడీ నేతల ఇండ్లలో సీబీఐ సోదాలు..

27
cbi
- Advertisement -

ఆర్జేడీ నేతల ఇండ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఉద్యోగాలకు భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్సీ, పార్టీ కోశాధికారి సునీల్‌ సింగ్‌ ,ఎంపీ అహ్మద్‌ కరీమ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈమధ్యకాలంలో రైల్వే నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే వారి భూములు తీసుకున్నట్లు లాలూతోపాటు, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ కేసులు నమోదుచేసింది.

- Advertisement -