- Advertisement -
విడాకుల తర్వాత తొలిసారి కలిశారు ధనుష్ – ఐశ్వర్య. తమ పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ రోజు చాలా బాగా మొదలయ్యేయింది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అని ఐశ్వర్య పోస్ట్ చేసింది. ఇక ధనుష్, పిల్లలతో కలిసి దిగిన ఫోటోని కూడా తన స్టోరీలో పోస్ట్ చేసింది.
ధనుష్, ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయినా ఇద్దరూ ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు.
- Advertisement -