క్షమాపణలు చెప్పిన జొమాటో

102
hrithik
- Advertisement -

ఎట్టకేలకు వెనక్కి తగ్గింది జొమాటో. హృతిక్ రోషన్ నటించిన మహాకాల్ యాడ్ వివాదం కాగా దీనిపై boycott zomato కూడా ట్రెండ్‌గా నిలిచింది. ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్‌ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్‌ నుంచే తెప్పించుకుని తింటా అని అనగా దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నివర్గాల నుండి విమర్శలు రావడంతో ఎట్టకేలకు వెనక్కితగ్గింది జొమాటో. తాము పేర్కొన్న మహాకాల్‌ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదని స్పష్టం చేసింది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని తెలిపింది.

- Advertisement -