హార్ట్‌ ఫుల్‌ నెస్‌ కార్యక్రమంలో పాల్గోన్న : ఎమ్మెల్సీ కవిత

101
kavitha
- Advertisement -

హైదారాబాద్ లోని హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (హెచ్‌ఈటీ), మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)వారి భాగస్వామ్యంతో నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సభకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, రామచంద్ర మిషన్ అధ్యక్షులు, హెచ్‌ఈటీ వ్యవస్థాపకులు కమలేష్ పటేల్ (దాజీ), ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ సహస్రబుద్ధి, ఇంకా యువర్ వన్ లైఫ్ కు సృష్టికర్త యోగి కోచార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ సంస్థల నుండి పలువురు వైస్-చాన్సలర్లు, డైరెక్టర్లు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలనుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సుమారు 10,000 మంది హాజరయ్యారు. 150 దేశాల నుండి కొన్ని వేలమంది వర్చ్యువల్‌ మీటింగ్‌లో పాల్గోన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు, హార్ట్‌ఫుల్‌ కాంపస్ మరియు యువర్ వన్ లైఫ్ లతో కలిసి ఈ అవార్డుల విజేతలను నిర్ణయించారు. దేశస్థాయిలో ఆనందకరమైన సంస్థలను గుర్తించి వాటికి ప్రప్రథమ అవార్డులు ఇస్తున్నారు.

తెలంగాణాకు ఎన్ని రకాల కఠిన పరిస్థితులను సృష్టించిన వాటిని తట్టుకొని నిలబడుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సమయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను సమర్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకోవాలని గుర్తించడం జరిగింది. ఈ దిశగా, హార్ట్‌ఫుల్‌నెస్ మరియు హ్యాపీనెస్ (ఆనందం) యొక్క ప్రాముఖ్యతను, అవి అందించగల బలమైన పునాదిని కూడా మేము గుర్తించాము. తెలంగాణా హృదయం ఆనంద నాదానికి నాట్యం చేయాలి. ఈ కార్యక్రమాన్ని మేము కేవలం తెలంగాణా వరకే పరిమితం చేయలేదు. హెచ్‌ఈటీ, ఏఐసీటీఈ, యువర్ వన్ లైఫ్, ఇంకా ఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ ల సహకారంతో ఇది భారతదేశం మొత్తాన్నీ ప్రభావితం చేసేలా ఈ సంస్థలను తయారుచేశామన్నారు.

తెలంగాణాకు చెందిన ముఫకమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, సెయింట్ మార్టిన్ & సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కు హార్ట్‌ఫుల్‌నెస్ అవార్డులు లభించాయి. ఇవే కాకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివెర్సిటీ (పంజాబ్), మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ (రాజస్థాన్), జైపూరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ (రాజస్థాన్), ఆర్యన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (చండీఘర్), మణిపుర్ యూనివెర్సిటీ, ఎస్‌జీటీ యూనివెర్సిటీ (హర్యానా), సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ (సిక్కిం), కేఐఈటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (ఘజియాబాద్), నేతాజీ సుభాష్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ), వెలమ్మాళ్ ఇంజినీరింగ్ కాలేజ్ (తమిళనాడు), మర్ బసెలస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కేరళ), జేఎస్‌ఎస్‌ అకాడెమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (కర్ణాటక), కలశలింగం ఆకాడెమి ఆఫ్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (తమిళనాడు), ఆమృత్సర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (పంజాబ్), అంబాలిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ & టెక్నాలజీ (యూపీ), భారతి విద్యాపీఠ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ స్టడీస్ & రీసెర్చ్ (మహారాష్ట్ర), టెక్నియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అద్వాన్స్డ్ స్టడీస్ (ఢిల్లీ), లక్ష్మీనారాయన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (మధ్యప్రదేశ్) తదితర సంస్థలకు కూడా అవార్డులు దక్కాయి.

- Advertisement -