సీఎం కేసీఆర్‌ టూర్‌ షెడ్యూల్‌

112
kcr
- Advertisement -

కొత్తగా వచ్చిన తెలంగాణలో జిల్లాల సంఖ్యను గణనీయంగా పెంచారు సీఎం కేసీఆర్‌. దానిక అనుగుణంగానే కొత్త జిల్లాలను కూడా గతంలోనే శంఖుస్థాపనలు చేశారు ఆయా జిల్లాల మంత్రులు. తాజాగా సీఎం కేసీఆర్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలు జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల29న పెద్దపలి జిల్లాలోని కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. సెప్టెంబర్‌5న నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను,సెప్టెంబర్‌12న జగిత్యాల జిల్లాలోని నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించి తెలంగాణ జాతికి అంకితం చేయనున్నారు. ఆయా జిల్లాలోని పెండింగ్‌లోని పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేసే విధంగా ఆదేశాలు జారీ చేయనున్నారు. దీంతో ఆధికారులు జిల్లాలోని పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -