- Advertisement -
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ ఇంట్లో రైడ్ నిర్వహించిన సీబీఐ…ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధమున్న మరో 13 మందికి కూడా నోటీసులిచ్చింది.
సోదాల్లో భాగంగా ఒక్క పైసా కూడా దొరకబట్టలేకపోవయారు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నారు మనీశ్. మోదీజీ ఈ జిమ్మిక్కేంది?. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. ఎక్కడి రావాలో చెప్పండి. నేనేమైనా మీకు కనిపించకుండా పోయానా? అని నిలదీశారు.
ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీఎత్తున అక్రమాలు చోటుసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆప్ సర్కార్ ఇటీవలె కొత్త మద్యం పాలసీని ఉపసంహరించుకుంది.
- Advertisement -