జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసింది. స్వల్ఫ లక్ష్య సాధనకు దిగిన భారత్ కేవలం 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచిన…. శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) రాణించారు. ఇషాన్ కిషన్ (6) విఫలమవగా.. దీప్ హుడా (25) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్ (43 నాటౌట్) మరోసారి తను సత్తాచాటాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తనదైన ఆటతీరుతో జట్టును అదుకున్నాడు. 26వ ఓవర్లో భారత విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. సిక్సర్‌తో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో ల్యూక్ జాంగ్వే రెండు వికెట్లతో సత్తా చాటగా.. తలన చివాంగ, విక్టర్ న్యూచి, సికందర్ రజా తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ దిగిన జింబాబ్వే సియాన్ విలియిమ్స్ (42) ర్యేన్ బూరీ(39) తో జట్టును స్కోరును పెంచగలిగారు. మిగిలిన బ్యాట్స్ మన్ భారత బౌలర్ల దాటికి వెనువెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. బౌలర్లలో శార్ధుల్ ఠాకూర్ (3) వికేట్లు తీశాడు.