బిల్కిస్‌ దోషుల విడుదలపై కేటీఆర్‌ ఫైర్‌

75
ktr
- Advertisement -

2002నాటి బిల్కిస్ బానో కేసు దోషుల విడుద‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు రాజ‌కీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయి. సాధార‌ణంగా అభివృద్ధి, భ‌ద్ర‌త‌, సంక్షేమంపై హామీలు ఇవ్వ‌డం చూశాం. ఇప్పుడు మ‌హిళ‌లు, చిన్నారుల‌ను చంపిన దోషుల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఒమిషన్‌, కమిషన్‌, రెమిషన్‌ లాంటి చర్యలను మరిచిపోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఖైదీలను విడుదల శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేమన్న ఆయన కర్మ సిద్దాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందేనని గుర్తు చేశారు.

- Advertisement -