- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 12,608 కరోనా కేసులు నమోదుకాగా 87 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,98,864కు చేరగా 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,01,343 కేసులు యాక్టివ్గా ఉండగా 5,27,206 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -