ఢిల్లీలో మళ్లీ కరోనా పంజా!

70
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ పంజా విసిరింది. రోజుకు ఎనిమిది నుంచి 10 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందుతున్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండగా ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గత పది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్పత్రులు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రమాదకర స్థాయికి కోవిడ్ -19 పాజిటివిటీ రేటు పెరిగిందని, తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే మాస్క్ తప్పని సరి చేసిన ప్రభుత్వం.. మాస్క్ ధరించక పోతే రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

- Advertisement -