కార్తీకేయ 2….ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్‌!

64
nikhil
- Advertisement -

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ . గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరిర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా రీసెంట్‌గా ఈ సినిమాకు సీక్వెల్ కార్తీకేయ 2తో ప్రేక్షకుల ముందుకువచ్చారు నిఖిల్.మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరుకోగా తాజాగా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం ప్లాన్‌ చేస్తోంది.

నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందించగా, అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

- Advertisement -