పీఎం రేసులో లేను: నితీశ్

70
nitish
- Advertisement -

ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పి మహాఘట్‌బంధన్‌తో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నితీశ్ పీఎం రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీనిని ఖండించారు.త‌న‌కు అలాంటి ఆలోచ‌న లేద‌ని విన‌మ్రంగా వెల్ల‌డిస్తున్నాన‌ని, అంద‌రికోసం ప‌నిచేయ‌డమే త‌న ప‌నని, విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగ ప‌నిచేసేలా చూస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా విప‌క్షాలు ఏక‌తాటిపైకి రావాల‌ని ఈ దిశ‌గా త‌న‌కు పెద్ద‌సంఖ్య‌లో ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పారు. విపక్షాలు ఐక్యంగా ముందుకెళితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్నారు.

ఇక ఆర్జేడీ చీఫ్ తేజస్వి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా ఆయనకు జడ్‌ప్లస్ సెక్యూరిటీ అందించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా వీటిని ఖండించారు నితీశ్‌. డిప్యూటీ సీఎంకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

- Advertisement -