8వ సారి బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం….

75
bihar
- Advertisement -

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్డీయే తో పొత్తు తెగ దెంపులు చేసుకొని బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ నితీష్‌ చేత ప్రమాణం చేయించారు. ఇక కూటమిలోని కీలక పార్టీ ఆయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి తల్లి రబ్రీదేవి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో నితీష్‌ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నితీష్‌ నిర్ణయాన్ని లాలూ సమర్థించి, అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి.

7 పార్టీలతో కూడిన మహాఘట్‌ బంధన్‌ కూటమి పేరుతో ఏర్పాటు చేశారు. పొత్తుల్లో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆర్జేడీ నుంచి మరో నేతకు స్పీకర్‌ పదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక మరో మిత్ర పక్షమైన కాంగ్రెసుకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో 2015లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ నితీష్‌ సీఎంగా ఉండగా…. తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

- Advertisement -