కామన్వెల్త్‌ లో బవీనాబెన్‌కు స్వర్ణం

87
- Advertisement -

కామన్వెల్త్‌గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. భవీనాబెన్‌ పటేల్‌ కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్ క్లాస్ ఫైనల్‌లో నైజీరియా ప్లేయర్‌ ఇఫెచుక్వుడేపై గెలుపుతో బంగారు పతకం సాధించింది. ఇఫెచుక్వుడేను 12-10, 11-2, 11-9 తేడాతో మట్టికరిపించింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 40 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 11 సిల్వర్‌, 16 బ్రోన్జ్‌ మెడల్స్‌ ఉన్నాయి. 155 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ (148), కెనడా (84), న్యూజిల్యాండ్‌ (44) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -