మంకీపాక్స్‌ మార్గదర్శకాలు….

59
monkeypox
- Advertisement -

దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు మంకీపాక్స్‌ కలవర పెడుతున్నాయి. ఇటీవల మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కచ్చితంగా పాటించాలని సూచించింది. మంకీ పాక్స్ బాధితులను ముట్టుకున్నా..వారికి సమీపంలో ఉన్న ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపింది.

మంకీపాక్స్ బాధితులను దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంత వరకు వారిని ఐసోలేషన్‌లోనే ఉంచాలి.
మంకీపాక్స్ బాధితులు మూడు లేయర్ల మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్యలు తీసుకోవాలి.
బాధితులకు వద్దకు వెళ్లే సమయంలో ముఖానికి తప్పనిసరిగా మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ఉండాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.
ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి..అప్రమత్తంగా ఉండాలి.

మంకీపాక్స్ బాధితుల దుస్తులు, టవళ్లు ఉపయోగించ వద్దు..వారు వాడిన గదిని కూడా ఉపయోగించరాదు..
మంకీపాక్స్ బాధితుల దుస్తులు, ఇతరుల దుస్తులను కలిపి ఉతకరాదు. వాటిని ప్రత్యేకంగా ఉంచాలి.
మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి..బహిరంగ ప్రదేశాల్లో తిరగ వద్దు.
మంకీపాక్స్‌పై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. బాధితుల పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదు.

- Advertisement -