తైవాన్‌ ఆక్రమణ దిశగా చైనా….

111
taiwan
- Advertisement -

అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా టూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి తైవాన్‌ రాజధాని తైపేకి వచ్చారు. చైనా… తైవాన్‌ తమ అంతర్బాగమని పదే పదే ప్రపంచ దేశాలకు హెచ్చరించిన నేపథ్యంలో…వాటిని లెక్కచేయకుండా నాన్సీ తైపేలో అడుగు పెట్టాడాన్ని జీర్ణించుకొలేకపోతుంది. బుధవారం నాడు నాన్సీ తైపే నుంచి వెళ్లగానే తైవాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా తైవాన్‌ చూట్టూ అష్టదిగ్బంధం చేస్తుంది. 24 గంటల్లో మీడియం షార్ట్‌ రేంజ్‌ మిస్సైల్‌తో తైవాన్‌ చైనా సరిహద్దుల వెంబడి భారీ బలగాలు మోహరించి, సైనిక డ్రీల్స్‌ నిర్వహిస్తుంది. వైమానిక దళం, నౌకాదళంలో సైనిక విన్యాసాలను చేపట్టింది. ఈ విన్యాసాలు తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి. టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు.. సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది.

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది. అమెరికా నావికాదళం తైవాన్ కు సమీపంలో పలు యుద్ద వాహక నౌకలను మోహరించింది. తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తైవాన్ మాత్రం స్వతంత్ర్య దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇది ఇష్టంలేని చైనా.. తరుచూ కవ్వింపులకు పాల్పడుతోంది. యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తర్వాత డ్రాగన్ కంట్రీ చర్యలు మరింత ముమ్మరం చేసింది.

- Advertisement -