దేశంలో బేటీ బచావో బేటీ పఢావో పథకంకు 2014-22 వరకు పత్రికలు,ఇతర ప్రకటనల కోసం రూ. 401 కోట్లు కేటాయించినట్లు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో తెలిపింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 405 జిల్లాలో ప్రచారం కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఇది మొత్తం వ్యయంలో 54 శాతంగా పేర్కొన్నారు. కాగా గడిచిన 8 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకూ రూ.740.18 కోట్లు ఖర్చు చేయగా కేవలం మీడియా ప్రచారం కోసం రూ. 401.04 కోట్లు ఖర్చు చేశామన్నారు. పిల్లల లింగ నిష్పత్తి, బాలికలు మరియు మహిళల సాధికారతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాడానికి కేంద్ర ప్రభుత్వం 2014 లో ఈ పథకంను ప్రవేశపెట్టారు.
మరో ప్రశ్నకు ఇరానీ స్పందిస్తూ, అంగన్‌వాడీ కేంద్రం (సక్షం అంగన్‌వాడీ)ను అప్‌గ్రేడ్ చేయడానికి, ఆరోగ్యం, పోషకాహారం మరియు సేవలలో మెరుగైన నాణ్యత కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా దేశవ్యాప్తంగా రెండు లక్షల (సంవత్సరానికి 40,000) అంగన్‌వాడీ సెంటర్‌లు అధునీకరించామని తెలిపారు. సక్షం అంగన్‌వాడీగా అప్‌గ్రేడ్ చేసి ఆరు సేవల ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్, ప్రీ-స్కూల్ నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్, పోషకాహారం & ఆరోగ్య విద్య, రోగనిరోధకత, ఆరోగ్య తనిఖీ, మరియు దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల వేదిక ద్వారా 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులందరికీ అర్హులైన లబ్ధిదారులందరికీ రెఫరల్ సేవలను అందిస్తున్నామని తెలిపింది.