10వారాల తర్వాతే ఓటీటీకి : నిర్మాతల మండలి!

46
tfpc
- Advertisement -

తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పది వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమల్లో నెలకోన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేశారు. వాటిలో భారీ బడ్జెట్‌ లో తీసే సినిమాలు 10 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు., పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వవచ్చు., రూ.6 కోట్లలోపు బడ్జెట్‌ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు., సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ ప్రతిపాదించింది. సాధారణ థియేటర్లు సి-క్లాస్‌ సెంటర్‌లో టికెట్‌ ధరలు రూ.100, రూ.70గా ఉంచాలని ప్రతిపాదించారు., ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేశారు.

- Advertisement -