నితిన్ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం . సినిమా ప్రమోషన్లో భాగంగా ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం అంటూ నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
పవర్ ఫుల్ డైలాగ్ తో పాటుగా అద్భుతమైన యాక్షన్ మరియు మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ఈ ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో సిద్దార్థ్ రెడ్డిగా నితిన్ పాత్ర స్వభావాన్ని ఈ స్మాల్ వీడియోలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. విలన్ సముద్రఖని ఆకట్టుకోగా నితిన్ సరసన కృతి శెట్టి – కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా ఈ నెల 30న థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.