దేశాభివృద్ధికి ఇది అత్యంత ప్రమాదకరం : మోడీ

55
modi
- Advertisement -

ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జలౌన్ జిల్లా ఒరాయ్‌ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుందన్నారు.

ప్రజలు, ముఖ్యంగా యువత ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ​నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమే కాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు.

- Advertisement -