45 మందితో సీఎం షిండే సర్కారు!

52
shinde
- Advertisement -

మహారాష్ట్ర నూతన సీఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేపట్టగా ఆ రాష్ట్ర నూతన మంత్రివర్గం 45 మందితో కోలువుదీరనుంది.

మంత్రివ‌ర్గంలో బీజేపీ నుంచి 25 మంది మినిస్ట‌ర్లుగా ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన మ‌రో 13 మంది కూడా మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంది. ఇందులో చాలామంది కొత్తవారే ఉండే అవకాశం ఉంది.

శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టి మ‌హారాష్ట్రలో బీజేపీ, శివ‌సేన సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన సంగతి తెలిసిందే.

- Advertisement -