సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ మూవీ అనుకున్న తేదీకి వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా “హ్యాపీ బర్త్ డే” సినిమా జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ను జూలై 8కి మార్చారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతున్నది.
ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ వైవిధ్యంగా ఉండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న లీడ్ క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి.
“హ్యాపీ బర్త్ డే” చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ: శేఖర్-వంశీ, మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.