‘రామారావు ఆన్‌ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

30
Ramarao On Duty
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఈ మూవీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమౌతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రటించారు చిత్ర బృందం. జూలై 29న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో రవితేజ సరసన రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ నాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటుంది.

- Advertisement -