మంత్రి హరీశ్‌ను కలిసిన బ్రిటిష్ హై కమిషనర్..

68
- Advertisement -

బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, భారత్ నుండి ప్రతినిధి పృథ్వి సహాని, ఇతర ప్రతినిధులు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిశారు. తెలంగాణలో పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలటీ ఆసుపత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సాంకేతిక సహకారం అందించేందుకు సిద్దమని సంసిద్ధతను వ్యక్తం చేశారు.

యుకే కు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ సర్వీస్ అందిస్తున్నది. 55 దేశాల్లో 480 హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది.”తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఇక్కడి ప్రభుత్వం కృషి వల్ల హైదరాబాద్ అబివృద్దికి మారుపేరుగా నిలిచింది. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో IHG ఆసక్తి చూపిస్తున్నది” అని అండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్, మెడికల్ కాలేజీలు, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తదితర అంశాల గురించి మంత్రి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీ హెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

- Advertisement -