- Advertisement -
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటగా వాటిని పట్టించుకోని కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
కర్ణాటకలోని మైసూరులో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు. అక్కడ త్రివిధ దళాధిపతులతో సమావేశమవుతారు. ముందుగా నేవీ చీఫ్ ఆర్.హరి కుమార్తో మోదీ సమావేశమవుతారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
భారీగా నిరసనలు వ్యక్తమవుతున్ననప్పటికీ, మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్’ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
- Advertisement -