రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను: గాంధీ

84
gopalakrishna
- Advertisement -

విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా తాను నిలబడడం లేదని తేల్చిచెప్పారు బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ. ఈ మేరకు మాట్లాడిన ఆయన.. తన పేరును ప్రతిపాదించినందుకు విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రపతి రేసు నుంచి శరద్​పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకోగా తాజాగా గాంధీ కూడా తప్పుకోవడంతో విపక్షాలు డైలమాలో పడ్డాయి.

మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ. దక్షిణాఫ్రికా, శ్రీలంకకు భారత హైకమిషనర్‌గా కూడా సేవలందించారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణ గాంధీ పోటీ చేసి వెంకయ్యనాయుడు చేతిలో ఓటమిపాలయ్యారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఈ నెల 15వ తేదీన నోటిఫికేష‌న్‌ జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లను స్వీక‌రించనున్నారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

- Advertisement -