- Advertisement -
ఓ వైపు భారత్ బంద్ మరోవైపు అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తనిఖీల పేరుతో పోలీసులు వాహనాలు నిలిపివేయడంతో ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ట్రాఫిక్‌లో గంటలకొద్దీ చిక్కుకుపోయి ఢిల్లీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు.
ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు.
రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -