అగ్నిపథ్ వీరులకు ఆనంద్‌ మహీంద్రా ఆఫర్‌..

37
Anand Mahindra
- Advertisement -

దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు.. తాజా ఈ పథకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు.

అగ్నివీరుల క్రమ శిక్షణ, నైపుణ్యం వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్‌లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని చెప్పారు. అగ్నిపథ్ కార్యక్రమంపై జరిగిన హింసాకాండ పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -