మోదీ అవినీతిపై టీఆర్‌ఎస్‌ యుద్దం..!

70
modi
- Advertisement -

త‌ను అవినీతియే చేయ‌లేద‌ని చెప్పుకునే మోడీ అడ్డంగా దొరికిపోయారా..? ఏకంగా విదేశాల్లో త‌న మిత్రుల‌కు స‌హాయం చేయ‌బోయి ఇరుక్కుపోయారా…? కావాల‌నే ఇండియన్ మీడియాను నోరెత్త‌కుండా చేస్తున్నారా…? ఇందుకు టీఆర్ఎస్ అవున‌నే స‌మాధానం చెప్తోంది. ఇటు టీఆర్ఎస్ పార్టీతో పాటు కేటీఆర్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా మోడీ అవినీతిపై యుద్ధం ప్ర‌క‌టించారు. దేశానికి కాపాల‌దారుడ‌ని చెప్పుకునే మోడీ దేశాన్ని అదానీల‌కు అమ్మేస్తున్నార‌ని సాక్ష్యాల‌తో స‌హా చూపిస్తున్నారు. నిజానికి మోడీ-అదానీల స్నేహం అంద‌రికీ తెలిసిందే. మోడీ ప్ర‌ధాని అయ్యాక అదానీ ఆస్తులు దేశాన్నే కొనే స్థాయికి చేరాయి. దీని వెనుక బీజేపీ, మోడీ ఉన్నార‌న్న ప్ర‌చారం ఉంది. మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న చేసి రాగానే ఆ దేశంలో అదానీ గ్రూప్ కు కాంట్రాక్టులు ద‌క్క‌టం చూస్తేనే ఉన్నాం.

తాజాగా బొగ్గు కొనుగోలు విష‌యంలో అదానీ కంపెనీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎంత దిగ‌జారిందో అంద‌రికీ అర్థం అయ్యింది. తాజాగా శ్రీ‌లంకు స‌హ‌యం చేసే విష‌యంలో మోడీ ఏం చేశారో శ్రీ‌లంక పార్ల‌మెంట్ లో జ‌రిగిన చ‌ర్చ‌ ఇప్పుడు మోడీని అడ్డంగా దొరికిపోయేలా చేసింది. శ్రీ‌లంక స‌హ‌యం కోర‌టం… ఓకే చెప్తూనే అదానీ కోసం మోడీ పెట్టిన ష‌ర‌తులు భార‌త ప్ర‌భుత్వ ప‌రువు తీసాయ‌ని, ఇది క్విడ్ ప్రో కో కాదా అంటూ టీఆర్ఎస్ దాడిని స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లు అవినీతి, అవినీతి అంటూ ఎదుటి పార్టీల‌పై బుర‌ద చ‌ల్లి… ఈడీ, సీబీఐల‌ను ప్ర‌యోగించిన బీజేపీ, ఇప్పుడు ఏం స‌మాధానం చెప్తుంద‌ని టీఆర్ఎస్ ప్ర‌శ్నిస్తోంది. ద‌మ్ముంటే దీనిపై విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తుంది. దేశ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకుంటున్న కేసీఆర్ కు… బీజేపీ అవినీతి అంశం కీల‌కం కాబోతుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక బీజేపీ తీరును కేసీఆర్ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తార‌ని, ఇదే కేసీఆర్ నినాదం కాబోతుంద‌ని అంటున్నాయి.

- Advertisement -