ఆసక్తిరేపుతున్న ‘సమ్మతమే’ ట్రైలర్..

53
Sammathame
- Advertisement -

ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌ గా న‌టిస్తున్న చిత్రం `సమ్మతమే. గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బేన‌ర్‌ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ.. సరదాలు.. అలకలు.. బుజ్జగింపులు.. వినోదాలు.. విషాదాలు.. ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ నటి సితార కనిపిస్తున్నారు.

‘లైఫ్ లో నీకు గోల్ ముఖ్యమా.. గాళ్ ముఖ్యమా’ అని హీరోయిన్ అడిగితే, ‘నా లైఫ్ లోకి గాళ్ రావడమే నా గోల్’ అనే హీరో డైలాగ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ‘లైఫ్ లో నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు..’ అంటూ హీరోపై హీరోయిన్ కోపాన్ని వ్యక్తం చేసే సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

- Advertisement -