- Advertisement -
ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ ఎండీ. పాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదయం వారి స్వగ్రామం అయిన జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామంలో వారి ఇంటికి వెళ్లి పాషా పార్థివ దేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాద ఘటన పై మంత్రి ఆరా తీశారు. ఈ ఘటన దురదృష్టకరం. జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. జర్నలిజానికి వారి మరణం తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.
- Advertisement -