- Advertisement -
ఆసియా కప్‌ను తామే నిర్వహిస్తామని తెలిపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ టోర్నీని నిర్వహించకుంటే తాము సుమారు ఐదు నుంచి ఆరు మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతామని, ప్రస్తుత పరిస్థితుల్లో అది తమకు చాలా అవసరమని తెలిపింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లకు విజ్జప్తి చేసింది.
ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంతో ఆటగాళ్లు, సిబ్బందికి జీతభత్యాలు, ఇతర వసతులు కల్పించే అవకాశముంటుందని తెలిపింది. ఆసియా కప్ కంటే ముందు తాము ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహించాల్సి ఉంది. మా ముందున్న పెద్ద సవాల్ అదేనని తెలిపింది.
ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితిని గమనిస్తే అధికారికంగా కరెంట్ కోతలు, పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటడంతో పాటు ద్రవ్యోల్భణం పెరిగి పోవడంతో మ్యాచ్‌ల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే.
- Advertisement -