ముగ్గురు ఆటగాళ్లపై వేటువేసిన లంక!

43
sl

శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తో సిరీస్ కు ముందు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అక్కడ లంక క్రికెటర్లు దనుష్క గుణతిలకా, కుశాల్ మెండిస్, నిరోషాన్‌ డిక్వెల్లాలు కరోనా నియమాలు ఉల్లంఘించినట్లు తెలియడంతో వారిని భారత్ తో జరిగే సిరీస్ నుండి తప్పించింది.

ఈ ముగ్గురు ఆటగాళ్లను ఏడాది పాటు అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్స్ నుండి అలాగే ఆరు నెలల పాటు డొమెస్టిక్ క్రికెట్ నుండి బ్యాన్ చేయడం మాత్రమే కాకుండా రూ.కోటి జరిమానా విధించించి. ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండా భారత్ తో తలపడిన లంక జట్టు వన్డే సిరీస్ ను కోల్పోగా టీ20 సిరీస్ లో విజయం సాధించింది.