‘మేజర్’ చిత్రం చేయడం నా అదృష్టం…సయీ మంజ్రేకర్‌

70
Saiee
- Advertisement -

మీడియాతో ఇంటర్వ్యూ లో ‘మేజర్’ చిత్రం చేయడం నా అదృష్టం. మేజర్ ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం” అని చెప్పిన మూవీ హీరోయిన్ సయీ మంజ్రేకర్‌. వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలయింది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్ర కథానాయిక సయీ మంజ్రేకర్‌ మీడియాతో ముచ్చటించారు. సయీ పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి.

‘మేజర్’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తాను. మేజర్ సందీప్ కి చిన్ననాటి ప్రేమికురాలిగా, అలాగే సందీప్ భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ వుంటుంది. ఒక సాదారణ కుర్రాడు అసాదారణ పనులు ఎలా చేశారనేది మేజర్ లో చూస్తారు. నాది నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్ర. ఫస్ట్ డే షూటింగ్ లో చాలా కంగారు పడ్డాను. తెలుగు సరిగ్గా అర్ధమయ్యేది కాదు. అయితే ఫస్ట్ షెడ్యుల్ పూర్తయిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతలా అంటే మేజర్ లో నా పాత్రకి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పాను.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చేయడం ఎలా అనిపించింది ?
మహేష్ బాబు నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేశాను. సల్మాన్ ఖాన్, అల్లు బాబీ, ఇప్పుడు మహేష్ బాబు నిర్మాణంలో చేశాను, కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా.

మేజర్ సందీప్ తల్లితండ్రులని కలిశారా ?
తాజ్ లో జరిగిన మేజర్ సందీప్ స్మారక కార్యక్రమంలో ఒకసారి వారి పేరెంట్స్ ని కలిశాను. దీని తర్వాత రెండు రోజుల క్రితం బెంగళూర్ లో జరిగిన మేజర్ ప్రివ్యూ లో మళ్ళీ వారిని కలిశాను. చాలా గొప్ప వ్యక్తులు. మేజర్ సందీప్ మదర్ ని చూస్తే నా మదర్ ని చూసినట్లే అనిపించింది. గొప్ప ప్రేమ, ఆప్యాయత వున్న వ్యక్తులు.

మేజర్ చూసిన తర్వాత మేజర్ సందీప్ తల్లితండ్రుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది?
మేజర్ సినిమా గురించి మేజర్ సందీప్ కజిన్ ఒకరు ఇన్స్టా లో స్టొరీ పోస్ట్ చేశారు. అందులో నా పనితీరు సందీప్ తల్లి ధనలక్ష్మీకి చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది నా పనితీరు వారికి నచ్చింది. ఇంతకంటే ఏం కోరుకోను.

కథ ప్రకారం మీరు సందీప్ కి ప్రపోజ్ చేస్తారా ? సందీప్ మీకు ప్రపోజ్ చేస్తారా ?
ఇద్దరూ..చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టొరీ అది.

మేజర్ లో మీ స్క్రీన్ ప్రజన్స్ ఎలా వుంటుంది ?
ఇషా పాత్రని పోషించడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్రకు మంచి గ్రాఫ్ వుంటుంది. 16 ఏళ్ల స్కూల్ గర్ల్ గా కనిపిస్తా, తర్వాత సందీప్ భార్యగా కనిపిస్తా, అలాగే ఒక ఆర్కిటెక్ట్ గా కనిపిస్తా.. ఒకే సినిమాలో ఇన్ని కోణాలు వుండే పాత్ర దక్కడం ఒక అదృష్టం. మేజర్ చిత్రంతో చాలా అంశాలు నేర్చుకున్నా.

మేజర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నమ్రత మేడమ్ మా పేరెంట్స్ కి తెలుసు. నమ్రత కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్న ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్ ని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం.

మేజర్ సినిమాలో మీకు నచ్చిన పాత్ర ?
మేజర్ సందీప్ రియల్ హీరో. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది. మేజర్ సందీప్ తల్లి పాత్ర చేసిన రేవతి కి నేను ఫిదా అయిపోయాను. రేవతి అద్భుతంగా చేశారు. ‘మేజర్’ సినిమాకి మేజర్ సందీప్ ఆత్మలాంటి వారైతే, మేజర్ తల్లి ధనలక్ష్మీ పాత్ర పోషించిన రేవతి సందీప్ కి ఆత్మలాంటి పాత్ర. చాల గొప్పగా వుంటుంది.

మేజర్ లో మీ పాత్రని ఎలా అవగాహన చేసుకున్నారు ?
మేజర్ సెట్స్ కి వెళ్ళినపుడు సీరియస్ గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అనే దానిపై నాకో అవగాహన లేదు. మొదటి సీన్ పూర్తయిన తర్వాత అందరూ ఆనందంగా నవ్వారు. మేజర్ సందీప్ జీవితం చాలా అందమైనది. ఇషా పాత్రకి తగ్గట్టుగా నా సెట్స్ లో నా మూడ్ స్వింగ్స్ ఉండేవి.

అడవి శేష్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
అడవి శేష్ గ్రేట్ డెడికేషన్ పర్సన్. అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి విసుగు లేకుండా చాలా కూల్ గా సమాధానం ఇస్తుంటారు. చాలా మంచి విషయాలు చెబుతుంటారు. ఆయన ఫ్రాంక్ లు కూడా చేస్తారు. నాకు బల్లులు అంటే భయం. చాలా అందంగా ఒక గిఫ్ట్ ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేస్తే అందులో రెండు బల్లులు వున్నాయి.

శోభితా ధూళిపాళ్ల తో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?
లేదు. కానీ మా ఇద్దరి పాత్రలు కథలో చాలా కీలకం. షూటింగ్ లో ఆమెను కలిశాను. చాలా స్వీట్ పర్శన్.

దర్శకుడు శశి కిరణ్ తిక్కా తో పని చేయడం ఎలా అనిపించింది ?
శశి చాలా కూల్ గా వుంటారు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. మేజర్ జరుగుతున్నపుడే శశి ఫాదర్ చనిపోయారు. అయినా ఆయన ఎంతో ధైర్యంగా సెట్స్ కి వచ్చారు. శశి చాలా అద్భుతమైన డైరెక్టర్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది.

మేజర్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ?
తెలుగు భాష విషయంలోనే కాస్త భయపడ్డా. ఐతే క్రమంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఆ సమస్యని అధిగమించి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా వుంది. అలాగే ఇది మేజర్ సందీప్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. కచ్చితంగా మాపై భాద్యత వుంటుంది. ప్రతి చిన్న విషయం కూడా లెక్కలోకి వస్తుంది. ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని సినిమా చేయడం కూడా ఒక సవాలే.

మీ పాత్ర తెలుగులో డబ్బింగ్ చెప్పారు కదా.. తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ?
తెలుగు వెర్షన్ వైజాగ్ లో చూశా. అసలు డబ్బింగ్ చెప్పింది నేనేనా అని నమ్మలేకపోయా. చాలా రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తి చేశాను. మాట పలకడం, డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాను. ఒక్కసారిగా తెరపై చూసేసరికి చాలా సర్ప్రైజ్ అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. చిత్ర యూనిట్ తో పాటు మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇకపై డబ్బింగ్ చెప్పడానికే ప్రయత్నిస్తా.

తెలుగులో రెండు సినిమాలు చేశారు కదా.. తెలుగు పరిశ్రమ ఎలా అనిపించింది ?
తెలుగు చిత్రపరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా వుంటారు. అందరూ డెడికేట్ గా వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా నచ్చింది.

మీ నాన్నగారు తెలుగులో అందరికీ తెలుసు. మీరు తెలుగు సినిమా చేస్తున్నపుడు సలహాలు ఏమైనా ఇచ్చారా?
డైలాగ్స్ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. తెలుగు మాటని హిందీలో ఒత్తులు, ధీర్గాలతో సహా సరిగ్గా రాసుకొని పలకమనే వారు. ఇది తెలుగు సరిగ్గా పలకడానికి సహకరించింది.

లేడి ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉందా ?
వుంది. ఇప్పటివరకూ మూడు సినిమాలు చేశాను. ఇంకా డిఫరెంట్ సినిమాలు పాత్రలు చేయాలనీ వుంది.

మీ కొత్త సినిమాలు ?
కొన్ని కథలు విన్నాను. హిందీలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది.

- Advertisement -