కర్ణాటక బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

58
cm kcr
- Advertisement -

శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని క‌ల‌బురిగిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని క్షతగాత్రులైన వారికి సరియైన వైద్యం అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

- Advertisement -