వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్‌గా గాడ్‌ఫాదర్ , మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, బాబీ డైరెక్షన్‌లో మెగా 154 సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.
ఇక చిరు 154వ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగగా దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే తాజాగా ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు విజయ్ సేతుపతి ఎంట్రీ ఉంటుందని.. ఆ తరువాత ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో మనకు సెకండాఫ్‌లో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది. చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.