విజ‌య్ దేవ‌ర‌కొండ @ కాఫీ విత్ క‌ర‌ణ్‌

122
- Advertisement -

బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ షో కాఫీ విత్ క‌ర‌ణ్.బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు ప‌లువురు బాలీవుడ్ న‌టులు పాల్గొని షోకి మ‌రింత రేటింగ్ తెచ్చారు. తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ టాప్ షోలో గెస్ట్ గా వెళ్ళాడు.

ఈ షో కొత్త సీజన్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ షోలో కాఫీ కాప్స్ మీద విజయ్, కరణ్ సైన్ చేయగా వాటిని ఫోటో తీసి విజయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

త్వరలో విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా సినిమా ప్ర‌మోష‌న్స్ చేయ‌నున్నారు విజ‌య్‌.

- Advertisement -