పర్యాటక క్షేత్రంగా నిమ్మకూరు!

128
nbk
- Advertisement -

టీడీపీ వ్యవస్థాపకులు,మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య…నిమ్మకూరును పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపు దిద్దుతామని ప్రకటించారు.

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. అన్ని తరాలుకు ఆదర్శప్రాయుడని తెలిపారు. తెలుగు జాతికి విశ్వరూపమని అన్నారు. తెలుగు జాతీ ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడిగా కొనసాగుతారని అన్నారు.

- Advertisement -