మహంకాళి జాతర.. తేది ఖరారు..!

52
bonalu
- Advertisement -

బోనాల ఉత్సవాలలో భాగంగా జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మహంకాళి అమ్మవారి విగ్రహం గురించి కొన్ని అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని, అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే దుష్ప్రచారం చేయడం,అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను, ఆధ్యాత్మిక చింతనను క్రుంగదీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిని అమ్మవారు క్షమించరని తెలిపారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం మూల విరాట్‌ లో ఎలాంటి మార్పు ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశీలిస్తూ, గాంధీ విగ్రహం తొలగింపు ప్రచారం అవాస్తవమని, గాంధీ విగ్రహ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేస్తున్నామని తేల్చి చెప్పారు. తరువాత ఉజ్జయిని ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించి, కొందరు కావాలనే ఆలయ ప్రతిష్ఠకు అపకీర్తి తెస్తున్నారని, అలాంటి అవాస్తవాలను నమ్మోద్దని స్పష్టీకరించారు.

- Advertisement -