రివ్యూ: ఎఫ్‌3

279
F3 Review
- Advertisement -

విక్టరీ వెంకటేశ్ , వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఎఫ్‌ 3 (F3). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఎఫ్‌2కి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలుండ‌గా ఇవాళ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ‌:
వెంకీ (వెంకటేష్), వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) ఇద్ద‌రూ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన వారు. వీరి పోరాటం అంతా డ‌బ్బు సంపాద‌న‌పైనే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఒక రోజు విజయనగరంలో ఒక సంపన్న పారిశ్రామికవేత్త తన వారసుడిని వెతుక్కుంటూ వస్తున్నట్లు వారు వింటారు. త‌ర్వాత వెంకీ, వరుణ్ ఏం చేస్తారు…?త‌ర్వాత జ‌రిగే ప‌రిణామ క్ర‌మాలేంటీ..? అన్న‌దే సినిమా క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్‌:
సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ న‌ట‌న‌, క్యాస్టింగ్,కామెడీ. త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు వెంక‌టేశ్. సినిమాను మ‌రో రేంజ్‌లోకి తీసుకెళ్ల‌డంలో వెంకీ పాత్ర అమోఘం. ఇక వ‌రుణ్ కూడా వెంకీకి పోటీ ప‌డీ న‌టించార‌రు. ఇక త‌మ‌న్నా, మెహ్రీన్ సినిమాకు గ్లామ‌ర్‌ను తీసుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ పోలీస్ ఆఫీస‌ర్‌గా , మురళి శర్మ పారిశ్రామికవేత్తగా ఒదిగిపోయారు. వెన్నెల కిశోర్, రఘు బాబు ఇత‌ర న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల‌కు వంద‌శాతం న్యాయం చేశారు.

మైన‌స్ పాయింట్స్‌:
సినిమాలో మేజ‌ర్ మైన‌స్ పాయింట్స్ క‌థ‌, క‌థ‌నం,సెకండాఫ్‌లో వ‌చ్చే కొన్ని సీన్స్‌.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూప‌ర్బ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ నీట్ గా ఉంది. ద‌ర్శ‌కుడు తాను ఎంచుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పాడు. ఇక నిర్మాణ విలువ‌ల‌కు వంక‌పెట్ట‌లేం.

తీర్పు:
2019లో వ‌చ్చిన ఎఫ్‌2కి సీక్వెల్‌గా వ‌చ్చిన చిత్రం ఎఫ్‌3. వెంక‌టేశ్ న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింట్ కాగా వెంకీ నుండి అద్భుత న‌ట‌న‌ను రాబ‌ట్టాడు ద‌ర్శ‌కుడు. వరుణ్ తేజ్ కూడా వెంకీకి ఏమాత్రం త‌గ్గ‌కుండా అద్భుత న‌ట‌న క‌న‌బ‌ర్చాడు. అయితే కొన్ని సీన్స్, సెకండాఫ్‌పై దృష్టి సారిస్తే బాగుండేది. ఓవ‌రాల్‌గా అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం ఎఫ్‌3.

విడుద‌ల తేదీ:27|05|2022
రేటింగ్:2.5|5
న‌టీన‌టులు: వెంక‌టేశ్‌,వ‌రుణ్ తేజ్,త‌మన్నా,మెహ్రీన్
సంగీతం: దేవీశ్రీ ప్ర‌సాద్
నిర్మాత‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
ద‌ర్శ‌కుడు: అనిల్ రావిపూడి

- Advertisement -