- Advertisement -
కరోనా నుండి ఇప్పుడిప్పుడే కంపెనీలు కొలుకుంటున్నాయి. ఇక ఉద్యోగులను సైతం తిరిగి ఆఫీస్‌కు రప్పిస్తుండగా కొంతమంది విముఖత చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది.
ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెండింతలు చేశామని, తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
కస్టమర్లు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయిందని, మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులకు తాము సిద్ధమయ్యామని ఈమెయిల్‌లో తెలిపారు.
- Advertisement -