ముంబైపై హైదరాబాద్ గెలుపు

86
hyd
- Advertisement -

లాంగ్ బ్రేక్ తర్వాత హైదరాబాద్ గెలుపు బాటపట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 190 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(48), టిమ్ డేవిడ్(46), ఇషాన్ కిషన్(43) రాణించారు.ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 76,ప్రియం గార్గ్ 42,పురాన్ 38 పరుగులతో రాణించారు. ఈ విజయంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ గెలుపు సాధించింది.

- Advertisement -