ఐపీఎల్‌.. టాస్ నెగ్గిన ముంబై..

54
MI vs SRH
- Advertisement -

ఐపీఎల్‌లో ఈరోజు ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్లు రెండు మార్పలతో బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్టేన‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొల‌గిన ముంబై జ‌ట్టుతో హైద‌రాబాద్ జ‌ట్టు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

ఇప్ప‌టిదాకా ఇరు జ‌ట్లు 12 మ్యాచ్‌లు ఆడ‌గా… 5 విజ‌యాల‌తో హైద‌రాబాద్ జ‌ట్టు 10 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. అదే స‌మ‌యంలో 3 మ్యాచ్‌లు మాత్ర‌మే నెగ్గిన ముంబై జ‌ట్లు కేవ‌లం 6 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉంది. వెర‌సి ముంబై ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొల‌గ‌గా…ఈ మ్యాచ్‌లో ఓడితే హైద‌రాబాద్ జ‌ట్టు కూడా అదే బాట‌న న‌డ‌వ‌నుంది.

తుది జట్లు..

సన్ రైజర్స్ హైదరాబాద్-కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, మార్క్ రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫరూఖీ

ముంబై ఇండియన్స్- ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రిస్టాన్ స్టబ్స్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మరణ్ దీప్ సింగ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్ఖండే, రైలీ మెరిడిత్

- Advertisement -