‘ఎఫ్3’ స్పెషల్ సాంగ్‌.. పూజా అందాల ఆరబోత..

39
- Advertisement -

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’ మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్‌గా ఎఫ్3ని రూపొందిస్తున్నారు.

‘ఎఫ్3’లో మరింత గ్లామర్ జోడించింది ”పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌’గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం క్యాచి డ్యాన్సింగ్ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో స్వరపరిచిన ఈ పార్టీ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటానికి అవాకాశం ఇచ్చింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ గ్రేస్‌తో అదిరిపోయే మూమెంట్స్ చేశారు. నాగినీ మ్యూజిక్ కి పూజా, వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ మాస్‌ని అలరించేలా వుంది. సాంగ్‌లో సునీల్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించి సాహిత్యం క్యాచిగా వుంది. మనిషి పెద్ద కలలు కనాలి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం ఈ పాటలో వుంది. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఫుల్ ఎనర్జీతో ఈ పాటని ఆలపించారు.ఈ పార్టీ సాంగ్‌లో పూజా హెగ్డే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

‘ఎఫ్3’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఎఫ్3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు విడుదలైన ”లైఫ్ అంటే ఇట్లా వుండాలా” సాంగ్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తూ.. ఇన్స్టంట్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎఫ్3లో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా సందడి చేస్తున్నారు.

https://youtu.be/W3B73VDCDfM
- Advertisement -